సీనియర్ నటి మాధురీ దీక్షిత్ సినీప్రయాణ విశేషాలను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం అడపాదడపా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నటి.. జీవితంలో కొన్ని పరిస్థితులు ఊహించని విధంగా ఒక్కసారిగా తలకిందులు అయిపోతా
యంటోంది. అలాగే ఇండస్ట్రీలో అడు గుపెట్టిన ప్రతీ ఒక్కరికి ఇబ్బందులు తప్పవని, ముఖ్యంగా ఈ పరిశ్రమ మహిళలకు అస్తవ్యస్తంగా ఉంటుందని చెప్పింది. అంతేకాదు కొన్ని సినిమాలు పూర్తయ్యే వరకు రెండు, మూడు షిఫ్టులు చేస్తూ ఆలసిపోతామన్న నటి.. మినీ వ్యాన్లో అవుట్ డోర్ షూటక్కు వెళ్లినప్పుడు నటీమణుల కష్టాలు గురించి వర్ణించలేనంటోంది. ఇక చిత్ర పరిశ్రమలోనే కాకుండా మిగతా రంగాల్లో ఎన్నో ఎత్తు పల్లాలు దాటుకుని పురోగతి సాధించిన మహిళలు ప్రతీచోట ఉన్నారన్న మాధురి.. ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలను అధిగమించి దర్శనిర్మాతలు అద్భుతమైన పనితీరుతో ప్రేక్షకులను మెప్పించడం కొన్నిసార్లు ఆశ్చర్యంగా ఉంటుందని తెలిపింది.