టాలీవుడ్ యంగ్ హీరోలలో శ్రీవిష్ణు ప్రత్యేకమనే చెప్పాలి. ఒక పక్క హీరోగా చేస్తూనే మరోపక్క మంచి చిత్రాలలో అవకాశం వస్తే సపోర్టింగ్ రోల్, సెకండ్ హీరో గా కూడా నటిస్తాడు. నటన మీద అంతటి ప్యాషన్ ఉన్న ఆర్టిస్ట్.
తాజాగా శ్రీవిష్ణు నటిస్తున్న కొత్త చిత్రం "అల్లూరి". ప్రదీప్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఇందులో కయదు లోహర్ హీరోయిన్ కాగా, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.
తాజాగా అల్లూరి సినిమా నుండి శ్రీవిష్ణు ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ కొంచెంసేపటి క్రితమే విడుదల చేసారు. పోస్టర్లో శ్రీవిష్ణు ఖాకీ దుస్తులు ధరించి, గన్ చేతపట్టి ఒక ఫెరోషియస్ పోలీసాఫీసర్ గా కనిపిస్తుండటంతో ఇదొక పోలీసు నేపధ్య చిత్రంగా తెరకెక్కుతోందని తెలుస్తోంది. నిజాయితీకి మారుపేరు అనే క్యాప్షన్ తో ఈ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాతో శ్రీవిష్ణు ఘనవిజయం సాధించాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.