యంగ్ బ్యూటీ రీతూ వర్మ తెలుగులో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఆమెకు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. హద్దులు దాటకుండానే గ్లామర్ పరంగా ట్రెండీగా కనిపిస్తూ మెప్పిస్తోంది ఈ బ్యూటీ. రీతూ వర్మ పెళ్లి చూపులు చిత్రంతో తెలుగులో తొలి హిట్ అందుకుంది. మరో విజయం కోసం రీతూ వర్మ ప్రయత్నిస్తోంది. అప్పుడప్పుడూ రీతూ వర్మకి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ఆ చిత్రాలు పరాజయం చెందుతుండడంతో రీతూ వర్మకి నిరాశ తప్పడం లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రీతూ వర్మ తన గ్లామరస్ పిక్స్ ని అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. రీతూ వర్మ గ్లామర్ విషయంలో ఎప్పుడూ హద్దులు దాటలేదు.