సీనియర్ హీరో కం క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రా లోకేష్ అక్రమ సంబంధంపై గత కొన్నిరోజులుగా మీడియాలో వస్తున్న వార్తలు ఎంత హాట్ టాపిక్ గా నిలిచాయో అందరికి తెలిసిన విషయమే. నరేష్, పవిత్ర ఒక హోటల్ రూమ్ లో ఉండగా, నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని, వారిపై చెప్పులతో దాడికి దిగడం మరింత హాట్ టాపిక్ గా నిలిచింది.
ఎప్పుడైతే, నరేష్ తో పవిత్ర అక్రమ సంబంధం పెట్టుకుందని మీడియాలో వార్తలు రావడం ప్రారంభమయ్యాయో, అప్పటి నుండి పవిత్రకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయని తెలుస్తుంది. కాంట్రవర్సీల్లో నిలిచే వ్యక్తులను తమ సినిమాల్లో నటింపజేసేందుకు టాలీవుడ్ దర్శకనిర్మాతలు అంతగా ఆసక్తి చూపించరు. దీంతో పవిత్ర రెండు పెద్ద సినిమాలలో తల్లిగా నటించే అవకాశాలను చేజార్చుకుందని సమాచారం. తమపై వస్తున్న పుకార్లను పవిత్ర కానీ, నరేష్ కానీ ఇప్పటివరకు ఎలాంటి డైరెక్ట్ ఎక్ప్లనేషన్ ఇవ్వలేదు.