టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఏ కొత్త సినిమా వస్తే అది చూడడం, నచ్చితే సదరు చిత్రబృందాలను సోషల్ మీడియా వేదికగా మెచ్చుకోవడం అలవాటు. మహేష్ కు ఈ అలవాటు ఎప్పటినుండో ఉంది. తాజాగా విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన "విక్రమ్" సినిమాను చూసిన మహేష్ ఆ మూవీ టీం మొత్తానికి పేరుపేరునా శుభాకాంక్షలను తెలియచేస్తూ ట్వీట్ చేసాడు. మహేష్ ట్వీట్ కు విక్రమ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ వెంటనే స్పందించి కృతజ్ఞతలు తెలియచేసాడు. కానీ, విక్రమ్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసిన అనిరుధ్ మాత్రం మహేష్ ట్వీట్ కు రిప్లై ఇవ్వలేదు. ఇప్పుడిదే మహేష్ అభిమానులకు అనిరుద్ పట్ల ఆగ్రహాన్ని కలుగజేస్తుంది. సూపర్ స్టార్ అంతటి వాడు మెచ్చుకుంటూ ట్వీట్ చేస్తే రిప్లై ఇవ్వవా...? అని సోషల్ మీడియాలో అనిరుద్ ను నెటిజన్లు ఒకరేంజులో ఆడేసుకుంటున్నారు.
అనవసరంగా ప్రతిఒక్కరిని మెచ్చుకోకండి. సోషల్ మీడియాలో చిత్రబృందంలోని అందరిని ట్యాగ్ చెయ్యకండి. మీరు వారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఒక్కోసారి వారినుండి ఎలాంటి రిప్లై కూడా రావట్లేదు. అందరితో మంచిగా ఉండాలని చూడకండి... అని అభిమానులు మహేష్ కు హితబోధ చేస్తున్నారు.