"దేవదాసు" మూవీ నుంచి 'అడిగీ అడగలేక' సాంగ్ లిరిక్స్:
అడిగీ అడగలేక… ఒక మాటే అడగనా
అడిగీ అడగలేక ఒక మాటే అడగనా
తెలిపీ తెలుపలేక… ఒక మాటే తెలుపనా
ఆశగ అడగనా… నీ అడుగునై అడగనా
మౌనమై తెలుపనా… నీ దానినై తెలుపనా
ఎన్ని జన్మలైన జంట వీడరాదనీ
అడిగీ అడగలేక… ఒక మాటే అడగనా
తెలిపీ తెలుపలేక… ఒక మాటే తెలుపనా
నీకన్న మెత్తనిది… నీ మనసే నచ్చినదీ
నీకన్న వెచ్చనిది… నీ శ్వాసే నచ్చినదీ
పెదవి కన్న ఎద తీయనిదీ
కనులకన్న కద అల్లరిదీ
నువ్వు కన్న సిగ్గే నాన్యమైనదీ
జన్మ కన్న ప్రేమే నమ్మికైనదీ
ఎన్ని జన్మలైన ప్రేమ మాయరాదనీ
అడిగీ అడగలేక… ఒక మాటే అడగనా
తెలిపీ తెలుపలేక… ఒక మాటే తెలుపనా
నీకన్న చల్లనిది… నీ నీడే దొరికిందీ
నీకన్న నిజమైంది… నీ తోడే నాకుందీ
సొగసుకన్న ఒడి వాడనిదీ
బిగుసుకున్న ముడి వీడనిదీ
ముల్లు లేని పువ్వే… ప్రేమ అయినదీ
పూలు లేని పూజే… ప్రేమ అన్నదీ
ఏ జన్మలోన ప్రేమ పూజ మానరాదనీ
అడిగీ అడగలేక… ఒక మాటే అడగనా
తెలిపీ తెలుపలేక… ఒక మాటే తెలుపనా
ఆశగ అడగనా… నీ అడుగునై అడగనా
మౌనమై తెలుపనా… నీ దానినై తెలుపనా
బాస చేసుకున్న… మాట మార్చరాదనీ
లా ల లాలలా… ఆ హా ఆఆ