భిన్నమైన కాన్సెప్ట్ తో తెలుగు ప్రేక్షకులను అలరించే దర్శకుడు మారుతి, హీరో నాని లు కలిసి సృష్టించిన నవ్వుల హంగామా భలే భలే మగాడివోయ్ చిత్రం. మతిమరుపు ఉన్న వ్యక్తిగా నాని మంచి కామెడీ పంచి, ఎమోషన్‌తో హృదయాల్ని హత్తుకునెలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ తప్పకుండా చేస్తానని దర్శకుడు మారుతి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కథా చర్చలు ప్రారంభించలేదని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa