ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగార్జున "ఘోస్ట్" పై అవాంఛిత పుకార్లు ..!!

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 07, 2022, 05:11 PM

ఈ ఏడాది "బంగార్రాజు" గా ప్రేక్షకులను పలకరించిన కింగ్ నాగార్జున త్వరలోనే "ఘోస్ట్" గా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో నాగార్జున తొలిసారి ఇంటర్పోల్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఇందులో సోనాల్ చౌహన్ హీరోయిన్. దుబాయ్, ఊటీ వంటి ఔట్ డోర్లలో నిరంతరాయంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపై కొన్ని అవాంఛిత రూమర్లు తెగ వైరల్ అవుతున్నాయి.
అదేంటంటే, ఘోస్ట్ మూవీ థియేటర్లలో కాకుండా డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కాబోతుందని మొన్నీమధ్య వరకు ప్రచారం జరిగింది. చిత్రబృంద సన్నిహిత వర్గాలు మాత్రం ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని, ఘోస్ట్ మూవీ థియేటర్లలోనే విడుదలవుతుందని, జూలై 9వ తేదీన ఈ విషయంపై మేకర్స్ అధికారికంగా క్లారిటీ ఇస్తారని అంటున్నారు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్, శ్రీనివాస సినిమాస్ ఎల్ ఎల్ పి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి భరత్ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa