కమల్ హాసన్ - శంకర్ కాంబోలో,1996లో వచ్చిన "ఇండియన్" (తెలుగులో "భారతీయుడు") సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు పాతికేళ్ళ తర్వాత ఈ మూవీకి సీక్వెల్ "ఇండియన్ 2" తెరకెక్కబోతుంది. చాన్నాళ్ల క్రితమే అందుకు ముహూర్తం కూడా ఖరారయ్యింది. కొంత షూటింగును కూడా పూర్తి చేసిన తర్వాత పలు కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. దర్శకుడు శంకర్ కి, నిర్మాతలకు మధ్య తెలెత్తిన క్రియేటివ్ డిఫరెన్సెస్ అండ్ ఈగో క్లాషెస్ ఇందుకు కారణమని తెలుస్తుంది.
ఆ తర్వాత కమల్, శంకర్ ఎవరి కెరీర్ లో వాళ్ళు బిజీగా మారారు. తాజాగా కమల్ నటించిన విక్రమ్ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో మరోసారి ఇండియన్ 2 వార్తల్లో ప్రధానాంశంగా మారింది. పలు కారణాల వల్ల ఈ సినిమాకు లాంగ్ బ్రేక్ వచ్చిందని, తప్పకుండా ఇండియన్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని విక్రమ్ ప్రమోషన్స్ లో స్వయంగా కమల్ పేర్కొన్నారు. దీంతో ప్రేక్షకాభిమానులు చాలా సంతోషం గా ఉన్నారు.
ఇండియన్ 2 సినిమాకు సంబంధించి వినిపిస్తున్న లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఇందులో కమల్ కు జోడిగా నటిస్తున్న కాజల్ అగర్వాల్ ప్లేస్ లో మరొక బాలీవుడ్ హీరోయిన్ ను రీప్లేస్ చెయ్యబోతున్నట్టు టాక్. పెళ్లి చేసుకుని, రీసెంట్గా మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తున్న కాజల్ ను డిస్టర్బ్ చేయకూడదనే ఉద్దేశంతోనే కమల్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. ఇంకా ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్ నటిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతమందిస్తున్నారు.