ఆర్ ఆర్ ఆర్ సినిమాతో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ దేశవ్యాప్తంగా భారీగా పెరిగిందన్న విషయం తెలిసిందే. దేశవిదేశాల్లో రామ్ చరణ్ నటనకు ప్రత్యేక ప్రశంసలు దక్కుతున్నాయి. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిదాయక రామరాజు పాత్రను స్క్రీన్ పై అంతే పవర్ఫుల్ గా, అంతే రాజసంగా ప్రెజెంట్ చేసాడు చెర్రీ. దీంతో దర్శకనిర్మాతలకు హిస్టారికల్ సినిమాల్లో చెర్రీ ఫస్ట్ ఛాయిస్ అయిపోయాడు.
తాజాగా ఫేమస్ ఇండియన్ హిస్టారికల్ అండ్ మైథలాజికల్ ఫిక్షన్ రైటర్ అమిష్ త్రిపాఠి చరణ్ వద్దకు ఒక క్రేజీ అండ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ను తీసుకు వచ్చాడట. అదేంటంటే, ఆయన రాసిన "సుహేల్ దేవ్" పుస్తకం ఆధారంగా రూపొందబడే సినిమాలో లీడ్ రోల్ పోషించమని అడిగారట. సుహేల్ దేవ్... చరిత్రపుటల్లో రహస్యంగా దాగిన గొప్ప రాజు. దేశం మర్చిపోలేని యుద్ధంలో దిగ్విజయంగా గెలుపొందిన వీరయోధుడు. అసలైతే, ముందు సుహేల్ దేవ్ పాత్ర కోసం బాలీవుడ్ హీరోలను సంప్రదించారంట. ఇటీవల సౌత్ ఫిలిం ఇండస్ట్రీ అందునా, టాలీవుడ్ క్రియేట్ చేసిన సెన్సేషనల్ హిట్లతో ఆ అవకాశం తెలుగు హీరోల వద్దకు వస్తుంది. ఏమైనా ఇంతటి ఒక ప్రెస్టీజియస్ సినిమాలో చెర్రీ నటించబోతున్నాడంటే, మెగా అభిమానులు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.