సౌజన్య దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ 'మా నీళ్ల ట్యాంక్' అనే సిరీస్ తో ఓటీటీ అరంగేట్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ తెలుగు సిరీస్ ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ ZEE5లో జూలై 15, 2022న విడుదల కానుంది. సుశాంత్ తన తొలి సిరీస్‌లో వంశీ అనే పోలీసుగా నటిస్తున్నాడు. తాజాగా ఇప్పుడు ఈ 8-ఎపిసోడ్‌ల సిరీస్ ట్రైలర్‌ను సిజ్లింగ్ బ్యూటీ పూజాహెగ్డే విడుదల చేసింది. ట్రైలర్ కామెడీతో నిండి అందరిని ఆకట్టుకుంటుంది. ప్రియా ఆనంద్, లావణ్య రెడ్డి, నిరోషా రథా, దివి వడ్త్యా, వాసు తదితరులు ఈ సిరీస్ లో ముఖ్య పాత్రలు పోషించారు. కొల్లా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ప్రవీణ్ కొల్లా ఈ సిరీస్ ని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa