ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"కార్తికేయ2" నుండి "నన్ను నేను అడిగా" ఫుల్ వీడియో సాంగ్ ఔట్ 

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 12, 2022, 06:11 PM

 చందూ మొండేటి డైరెక్షన్లో నిఖిల్ సిద్దార్ధ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం "కార్తికేయ 2". ఈ మిస్టరీ ఫాంటసీ మూవీని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి. కాలభైరవ సంగీతం అందించిన ఈ సినిమా జూలై 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాలి కానీ, కొన్ని కారణాల వల్ల ఆగస్టు మొదటి వారానికి వాయిదా పడింది. 
తాజాగా ఈ మూవీ నుండి "నన్ను నేను అడిగా" అనే మెలోడియస్ సాంగ్ కు సంబంధించిన ఫుల్ వీడియోను కొంచెంసేపటి కృతమే మేకర్స్ విడుదల చేసారు. ఇందులో నిఖిల్, అనుపమ కలిసి ఏదో టూర్ కు వెళ్తూ ఉంటారు. ఈ ప్రయాణంలో అనుపమపై మనసు పారేసుకుంటాడు నిఖిల్. ఈ పాటను ఇన్నో గెంగా ఆలపించగా, కృష్ణ మదినేని లిరిక్స్ అందించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa