ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెర్రీ కోసం హైదరాబాద్ వచ్చిన కియారా..!

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 12, 2022, 07:04 PM

బోయపాటి శ్రీను డైరెక్షన్లో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కికిన "వినయ విధేయ రామ" లో తొలిసారి కలిసి నటించారు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, కియారా అద్వానీ. ఆ సినిమా అంత హిట్ అవ్వకపోయినా ఈ పెయిర్ కు మంచి పేరొచ్చింది.
ఈ జంట మరోసారి ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ నటిస్తున్న 15వ చిత్రంలో కియారానే హీరోయిన్. ఇప్పటికి అరవై శాతం షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ కొత్త షెడ్యూల్ రేపటి నుండి హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ లో కియారా కూడా పాల్గొనబోతుంది. ఇందుకోసం ఆమె కొంచెంసేపటి క్రితమే హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగింది. ఈ షెడ్యూల్ లో సినిమాలోని కీలక నటీనటులందరూ పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa