నాచురల్ స్టార్ నాని, మలయాళ బ్యూటీ నజ్రియా నాజిమ్ జంటగా నటించిన చిత్రం అంటే సుందరానికి. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యార్నేని, రవి శంకర్ నిర్మించారు. జూన్ 10న విడుదలైన ఈ సినిమా డీసెంట్ టాక్ తో థియేటర్లలో రన్ అయ్యింది.
గత వారం నుండి ప్రముఖ నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు ప్రేక్షకులు విశేష స్పందన కనబరుస్తున్నారు. దీంతో నెట్ ఫ్లిక్స్ ఇండియా టాప్ టెన్ మూవీస్ లో నెంబర్ పొజిషన్ లో ఈ మూవీ ట్రెండ్ అవుతుంది. యూనివర్సల్ కాన్సెప్ట్ కు కాస్తంత కామెడీ జోడించి డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఈ సినిమాను రూపొందించిన విధానం, నటీనటుల అద్భుతమైన నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa