బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్ బీర్ కపూర్, ఆలియాభట్ తొలిసారి కలిసి స్క్రీన్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్న చిత్రం "బ్రహ్మాస్త్ర". అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో మైథలాజికల్ ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 9వ తేదీన పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ చిత్రం కోసం మేకర్స్ "అస్త్రవర్స్" అనే కొత్త ప్రపంచాన్ని సృష్టించారు. ఈ ప్రపంచాన్ని వర్ణిస్తూ, డైరెక్టర్ అయాన్ ముఖర్జీ లేటెస్ట్ గా స్పషల్ వీడియోను విడుదల చేసారు. అస్త్రవర్స్ అంటే ఏంటి? ఎన్ని అస్త్రాలు ఉంటాయి? వాటి ప్రాముఖ్యత? వీటన్నిటి గురించి బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఇస్తూ చేసిన వీడియో సినిమాపై తగినంత అవగాహన కల్పించే విధంగా ఉంది.
తెలుగులో ఈ చిత్రాన్ని గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి సమర్పించడం విశేషం. ఈ సినిమాలో కింగ్ నాగార్జున, అమితాబ్ బచ్చన్, మౌనిరాయ్ కీలక పాత్రలు పోషించారు.