హారర్ ఎంటర్‌టైనర్ మూవీస్ తీయటంలో మంచి పేరు తెచ్చుకున్న మైస్కిన్ ఇప్పుడు తాజాగా 'పిసాసు 2' తో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. తెలుగులో 'పిశాచి 2' గా విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సమర్పిస్తున్నారు. ఈ సినిమాలో ఆండ్రియా జెరెమియా, విజయ్ సేతుపతి, రాజ్‌కుమార్ పినా, పూర్ణ, సంతోష్ ప్రతాప్ ముఖ్యమైన పాత్రలలో నటించారు. తాజాగా మూవీ మేకర్స్ ఈరోజు ఈ సినిమాలోని 'కాలమెంత వేగములే' అనే పాటను విడుదల చేసారు. ఈ పాటకు పోతుల రవికిరణ్ సాహిత్యం అందించగా, సిద్ శ్రీరామ్ తన శ్రావ్యమైన స్వరంతో పాడారు. కార్తీక్ రాజా ఈ హారర్ మూవీకి సంగీతం అందిస్తున్నారు. రాక్‌ఫోర్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మించబడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa