ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కళ్యాణ్ రామ్ "బింబిసార" నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ ..!

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 13, 2022, 05:15 PM

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న కొత్త చిత్రం "బింబిసార". రచయిత- డైరెక్టర్ వశిష్ట్ తెరకెక్కించిన ఈ మూవీలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ "ఈశ్వరుడే" ఫుల్ లిరికల్ వెర్షన్ ను కొంచెంసేపటి క్రితమే మేకర్స్ అధికారికంగా విడుదల చేసారు. కాలభైరవ ఆలపించిన ఈ పాటకు చిరంతన్ భట్ మ్యూజిక్ అందించారు. శ్రీమణి లిరిక్స్ అందించారు.  షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 5 వ తేదీన విడుదల కావడానికి రెడీ అవుతుంది.
ఇందులో క్యాథెరిన్ థెరెసా, సంయుక్త మీనన్, వారిన హుస్సేన్, వెన్నెల కోశోర్, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి తదితరులు నటిస్తున్నారు.  ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను ఎం.ఎం కీరవాణి అందిస్తున్నారు. హరికృష్ణ కే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa