కిస్సింగ్ సీన్లు, బికినీ గురించి ప్రజలు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారని, అవన్నీ తాను 15 ఏళ్ల కిందటే చేశానని బాలీవుడ్ భామ మల్లికా షెరావత్ చెప్పింది. ప్రముఖ నటి దీపికా పదుకొనే గెహ్రాయియా సినిమాలో చేసిన బోల్డ్ సీన్స్ తాను చాలా కాలం క్రితం మర్డర్ సినిమాలో చేశానని బుధవారం ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. తన శరీరం గురించి, గ్లామర్ గురించి మాట్లాడతారే కానీ, తన నటనా సామర్థ్యాల గురించి మాట్లాడరని ఆమె వాపోయింది.