వెంకీ మామ తరువాత, దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబీ) తన తదుపరి చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ లాక్ చెయ్యని ఈ మూవీ చిరుకు 154వ సినిమా కావడంతో మెగా #154 గా పిలుస్తున్నారు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.
తాజాగా ఈ మూవీపై మేకర్స్ అద్దిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ రోజు సాయంత్రం 4:05 గంటలకు మెగా అభిమానులకు పూనకాలు తెప్పించే సూపర్ సర్ప్రైజ్ రివీల్ కాబోతుందని ప్రకటించారు. దీంతో మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఆ సర్ప్రైజ్ కోసం ఎదురుచూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa