సూపర్ స్టార్ మహేష్ బాబు హిందీ సినిమాలలో నటించడం పట్ల గతంలో చేసిన వ్యాఖ్యలు ఎంత వైరల్ అయ్యాయో అందరికి తెలిసిందే. బాలీవుడ్ పరిశ్రమ తనను భరించలేదని మహేష్ అన్న వ్యాఖ్యలు బాలీవుడ్ లో కాంట్రవర్సీకి దారితీసాయి. ఆ తదుపరి మహేష్ తన ఇంటెన్షన్ ను(తెలుగులో నటించడమే తనకు కంఫర్ట్ గా ఉంటుందని) వివరించడంతో ఆ గొడవ సర్దుమణిగింది.
తాజాగా ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కూడా హిందీ సినిమాలలో నటించడం అనే అంశంపై సూపర్ స్టార్ మహేష్ బాబును అనుసరిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బన్నీ, ప్రస్తుతం తానున్న పరిస్థితుల్లో హిందీ సినిమాల్లో నటించడం అంటే తన కంఫర్ట్ జోన్ దాటి బయటకు రావడమేనని, అందుకు తాను సిద్ధంగా లేనని, మంచి స్క్రిప్ట్, డైరెక్టర్ కుదిరితే ఇక, తప్పక చేస్తానని చెప్పుకొచ్చారు. తెలుగులో లీడ్ హీరో రోల్స్ లో నటించే తాను హిందీలో సెకండ్ హీరో రోల్స్ లో ఏ పరిస్థితుల్లోనూ నటించనని చెప్పుకొచ్చారు. తెలుగులో టాప్ స్టార్ గా ఉండి, హిందీలో సెకండ్ హీరో గా నటిస్తే ఆ సినిమా తప్పక ఫెయిల్ అవుతుందని, సో.., అలాంటి వాటి జోలికి తాను పొదలుచుకోలేదని చెప్పుకొచ్చారు.