యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్ నెమ్మదిగా టాలీవుడ్ లో అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. తన క్యూట్ అండ్ బ్యూటిఫుల్ లుక్స్ తో సంయుక్త తెలుగు ప్రేక్షకులని మెస్మరైజ్ చేస్తోంది. భీమ్లా నాయక్ చిత్రంలో సంయుక్త మీనన్ నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్ లో మెరిసింది. అలాగే గ్లామర్ రోల్స్ లో అవకాశం చిక్కితే రాణించాలని భావిస్తోంది.
భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే అందరిని ఆకర్షించేసింది సంయుక్త మీనన్. గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ తన స్పీచ్ తో సంయుక్త అందరినీ కట్టి పడేసింది. హైదరాబాద్ తన హోమ్ టౌన్ కావాలని, ఇక్కడ ఎక్కువ చిత్రాల్లో నటించాలని ఆశిస్తున్నట్లు తన మనసులో మాట బయట పెట్టింది.ఆమెలో గ్లామర్ యాంగిల్ కూడా ఉంది. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే ఫొటోలే అందుకు ఉదాహరణ. బికినీ ఫోజుల్లో సైతం కుర్రాళ్ళని హీటెక్కిస్తోంది. తాజాగా సంయుక్త మీనన్ సోషల్ మీడియాలో బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేసింది. సంయుక్త మీనన్ హోమ్లీగా కనిపిస్తూనే గ్లామరస్ లుక్ లో అదరగొడుతోంది.