ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"థాంక్యూ" కి ఆ సినిమాలతో సంబంధం లేదు - దిల్ రాజు

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 18, 2022, 12:06 PM

విక్రమ్ కే కుమార్ డైరెక్షన్లో ఫీల్ గుడ్ మూవీ గా తెరకెక్కుతున్న చిత్రం "థాంక్యూ". ఇందులో రాశిఖన్నా, అవికాగోర్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూలై 22 న విడుదల కాబోతుంది.
ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఒక ప్రెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.... చాలామంది "థాంక్యూ" ను ప్రేమమ్, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమాలతో పోలుస్తున్నారని, నిజానికి ఆ సినిమాలకు ఈ సినిమాకు ఎలాంటి సంబంధం ఉండదని చెప్పారు. థాంక్యూ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో, డిఫరెంట్ ఎమోషన్ తో తెరకెక్కిందని, ఒక వ్యక్తి జీవితంలో వివిధ దశలలో ఎదురయ్యే విభిన్న డ్రామాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిందని చెప్పుకొచ్చారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com