హను రాఘవపూడి డైరెక్షన్లో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న చిత్రం "సీతారామం". ఇందులో బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, నేషనల్ క్రష్ రష్మిక మండన్నా కీలక పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఆగస్టు 5వ తేదీన విడుదల కాబోతుంది.
లేటెస్ట్ గా మేకర్స్ ఈ మూవీ నుండి స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. ప్రేక్షకాభిమానులకు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ లను కలిసి వారితో ముచ్చటించే అవకాశాన్ని కల్పిస్తూ, హైదరాబాద్ లోని మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజీలో ఈ రోజు మధ్యాహ్నం నుండి ఒక స్పెషల్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నామని పేర్కొంటూ ప్రకటించారు.