విరాటపర్వం తదుపరి సాయిపల్లవి నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం "గార్గి". గౌతమ్ రామచంద్రన్ ఈ చిత్రానికి దర్శకుడిగానే కాక కో ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించారు. కాన్సెప్ట్ నచ్చి ఈ సినిమాను తమిళంలో హీరో సూర్య, జ్యోతిక, తెలుగులో హీరో రాణా సమర్పించడం విశేషం.
ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు తెలుగులో కన్నా తమిళంలో మంచి స్పందన వస్తుంది. ఈ మేరకు హీరో సూర్య ప్రేక్షకాభిమానులకు కృతజ్ఞతలను, గార్గి చిత్రబృందానికి శుభాకాంక్షలను తెలుపుతూ స్పెషల్ ట్వీట్ చేయగా, అందుకు సాయి పల్లవి స్పందించింది. మీ సపోర్ట్ తోనే గార్గి ఇంతటి ఘనవిజయం సాధించిందని పేర్కొంటూ, హీరో సూర్యకు సాయి పల్లవి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియచేసింది. అలానే జ్యోతికకు కూడా తన కృతజ్ఞతలను తెలియచేయమని చెప్పింది.