ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రవితేజ కెరీర్లో హిస్టరీ క్రియేట్ చేసిన "RROD" ట్రైలర్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 18, 2022, 02:36 PM

చాన్నాళ్లుగా మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రామారావు ఆన్ డ్యూటీ ట్రైలర్ శనివారం విడుదల కాగా, యూట్యూబ్ లో ఆ ట్రైలర్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. 24గంటల్లోనే 11 మిలియన్స్ వ్యూస్ సాధించి, 211కే లైక్స్ తో యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ వీడియోస్ లో దూసుకుపోతుంది. రవితేజ ఇప్పటివరకు నటించిన సినిమాలలో ఈ సినిమా చాలా స్పెషల్. ఎందుకంటే, ఈ మూవీ ట్రైలర్ మిగిలిన సినిమాల కన్నా ఎక్కువ వ్యూస్ సాధించి, రవితేజ సినీ కెరీర్లో ఆల్ టైం రికార్డును క్రియేట్ చేసింది.
శరత్ మండవ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాలో దివ్యాన్ష కౌశిక్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, RT టీం వర్క్స్ బ్యానర్ లపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 29వ తేదీన విడుదల కాబోతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa