కే ఎస్ రవీంద్ర (బాబీ) డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి, మాస్ రాజా రవితేజ కలిసి నటిస్తున్న చిత్రం "మెగా 154". ఇందులో శృతి హాసన్ కథానాయిక కాగా, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2023 జనవరి విడుదల కానుంది.
పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ సుమలత ఒక కీలక పాత్ర పోషించబోతున్నట్టు లేటెస్ట్ టాక్ ఫిలిం నగర్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో రవితేజ తల్లిగా సుమలత నటించబోతున్నట్టు వినికిడి. మరి, ఈ విషయంలో అధికారిక క్లారిటీ రావలసి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa