సమంతకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ముఖ్యఅతిథిగా ఆహ్వానం అందుకుంది. ఈ ఫెస్టివల్ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఆగస్టు 12న ప్రారంభం కానుంది.
ఈసందర్భంగా సమంత మాట్లాడుతూ 'గతేడాది ఐఎఫ్‌ఎఫ్‌ఎంలో భాగమయ్యాను. కొద్దికాలానికే భారతీయ సినిమా ప్రతినిధిగా అంతర్జాతీయ చిత్రోత్సవంలో పాల్గొనడం గర్వంగా ఉంది. ఈ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి ఆసక్తిగా వెయిట్ చేస్తున్న' అని అన్నారు.