మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం చిన్న వెకేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. అలాగే తన భారీ హిట్ “సర్కారు వారి పాట” సినిమా సక్సెస్ తో మరింత ఎనర్జిటిక్ గా ఉన్నారు. అయితే ఇప్పుడు మహేష్ ఈ బ్రేక్ లో ఉండగా ఈ సమయాన్ని తన ఫ్యామిలీ తో ఎంతో ఆహ్లాదంగా గడుపుతున్నారు. మరి వీరు అంతా కూడా ఘట్టమనేని రమేష్ బాబు తనయుడు జయ కృష్ణ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.మరి ఈ హ్యాపీ మూమెంట్ లో మహేష్ బాబు స్వయంగా వారి అందరితో కలిసి ఓ కూల్ సెల్ఫీ తీసుకోవడం ఆసక్తిగా ఉంది. తన కుటుంబం ఆనందం అంతా తన లోనే ఉంది అనే స్థాయిలో మహేష్ ఈ సెల్ఫీ లో కనిపిస్తున్నారు. ఇది మాత్రం మహేష్ ఫ్యాన్స్ కి డెఫినెట్ గా ఒక బెస్ట్ పిక్ గా నిలుస్తుందని చెప్పాలి. ఇక ఇదిలా ఉండగా మహేష్ అయితే నెక్స్ట్ దర్శకుడు త్రివిక్రమ్ తో తమ హ్యాట్రిక్ సినిమా కోసం రెడీ అవుతున్నారు.