నందమూరి కల్యాణ్ రామ్ నటిస్తున్న తొలి హిస్టారికల్ ఎంటర్టైనర్ "బింబిసార". రచయిత- డైరెక్టర్ వశిష్ట్ తెరకెక్కించిన ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 5 వ తేదీన విడుదల కావడానికి రెడీ అవుతుంది. ఇందులో క్యాథెరిన్ థెరెస్సా, సంయుక్త మీనన్, వారిన హుస్సేన్, వెన్నెల కోశోర్, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను ఎం.ఎం కీరవాణి అందిస్తున్నారు. హరికృష్ణ కే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
లేటెస్ట్ బజ్ ప్రకారం, మేకర్స్ ఈ మూవీ ప్రివ్యూను యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు స్పెషల్ షో వేసారంట. అదిచూసిన తారక్ బింబిసార మూవీ టీం మొత్తానికి శుభాకాంక్షలను తెలియచేశారట. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ పవర్ఫుల్ యాక్షన్, వశిష్ట్ క్రియేటివ్ టేకింగ్ పై ప్రశంసలు కురిపించాడట. ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టేంత ఘనవిజయం సాధిస్తుందని అన్నారట. తారక్ అన్నట్టు, బింబిసార బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందా? తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాలి.