నాచురల్ స్టార్ నాని, మలయాళ బ్యూటీ నజ్రియా నాజిమ్ జంటగా నటించిన చిత్రం అంటే సుందరానికి. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యార్నేని, రవి శంకర్ నిర్మించారు. జూన్ 10న విడుదలైన ఈ సినిమా డీసెంట్ టాక్ తో థియేటర్లలో రన్ అయ్యింది.
లేటెస్ట్ గా ఈ మూవీ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ను త్వరలోనే రిలీజ్ చెయ్యబోతున్నట్టు ఆడియో రైట్స్ సొంతం చేసుకున్న సరిగమ తెలుగు సంస్థ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసింది. ఈ చిత్రానికి వివేక్ సాగర్ అందించిన సంగీతం సన్నివేశాలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఇటీవలే ఓటిటిలో విడుదలైన ఈ చిత్రానికి థియేటర్లలో వచ్చిన స్పందన కన్నా మెరుగైన స్పందన రావడం విశేషం.