విక్రమ్ కే కుమార్ డైరెక్షన్లో, అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న ఫీల్ గుడ్ మూవీ "థాంక్యూ". ఇందులో రాశిఖన్నా, అవికాగోర్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూలై 22 న విడుదల కాబోతుంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, థాంక్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలిలా ఉన్నాయి. నైజాం - 8కోట్లు, సీడెడ్ - 2.5 కోట్లు, ఆంధ్ర - 9.5 కోట్లు... ఏపీ, తెలంగాణా లలో మొత్తం ఇరవై కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా - కోటిన్నర, ఓవర్సీస్ - రెండున్నర కోట్లు... మొత్తం కలుపుకుని వరల్డ్ వైడ్ 24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది. పాతిక్కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa