సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ ఈరోజు ఉదయం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. అందుతున్న సమాచారం మేరకు, మహేష్ ఫ్యామిలీ లండన్ కెళ్లినట్టు తెలుస్తుంది. ఐతే, ఈ సారి విహారయాత్రలా కాకుండా, ఇటీవలే టెన్త్ క్లాస్ డిస్టింక్షన్ లో పాస్ ఐన గౌతమ్ ను విదేశాలలో చదివించేందుకు మహేష్, నమ్రత వెళ్ళబోతున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ కారణంగానే త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ఆగస్టుకు వాయిదా పడిందనే టాక్ కూడా ఉంది. ఏది ఏమైనప్పటికి మహేష్ - త్రివిక్రమ్ మూవీ ఆగస్టులో సెట్స్ పైకి వెళ్లబోతుందని తెలిసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అతడు, ఖలేజా తర్వాత దాదాపు పదకొండేళ్లకు మళ్ళీ ఈ కాంబో పట్టాలెక్కడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa