ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"సీతారామం" లోని "కానున్న కళ్యాణం" సాంగ్ లిరిక్స్  

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 22, 2022, 01:00 PM

చిత్రం : సీతారామం
నటీనటులు : దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్
దర్శకత్వం : హను రాఘవపూడి
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: అనురాగ్ కులకర్ణి, సింధూరి


పల్లవి:
కానున్న కళ్యాణం ఏమన్నది ... స్వయంవరం మనోహరం
రానున్న వైభోగం ఎటువంటిది... ప్రతిక్షణం మరోవరం
విడువని ముడి ఇది కదా... ముగింపులేని గాథగా
తరముల పాటుగా ... తరగని పాటగా
ప్రతి జత సాక్షిగా ... ప్రణయము నేలగా సదా



కోరస్:
కన్నుల్లోని కలలు అన్ని
కరిగిపోని కళలుగా
కళ్ళముందు పారాడగా



చరణం -1 :
చుట్టూ ఎవరూ ఉండరుగా ... కిట్టని చూపులుగా
చుట్టాలంటూ కొందరుండాలిగా... దిక్కులు ఉన్నవిగా
గట్టిమేళమంటూ ఉండదా ... గుండెలోని సందడి చాలదా
పెళ్లి పెద్దలెవరు మనకి... మనసులే కదా... అవా? సరే...



కోరస్:
కన్నుల్లోని కలలు అన్ని
కరిగిపోని కళలుగా
కళ్ళముందు పారాడగా



చరణం -2:
తగు తరుణం ఇది కదా... మదికి తెలుసుగా
తదుపరి మరి ఏమిటట... తమరి చొరవట
బిడియమిదేంటి కొత్తగా... తరుణికి తెగువ తగదుగా
పలకని పెదవి వెనక ...పిలుపు పోల్చుకో... సరే మరి...



కోరస్:
కన్నుల్లోని కలలు అన్ని
కరిగిపోని కళలుగా
కళ్ళముందు పారాడగా






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com