విశ్వక్ సేన్, రుహానీ శర్మ జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హిట్: ది ఫస్ట్ కేస్. హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి త్రిపురనేని నిర్మించిన ఈ సినిమా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కి సెన్సేషనల్ హిట్ అయ్యింది.
హిట్ : ది ఫస్ట్ కేస్ కు సీక్వెల్ హిట్ 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో అడవిశేష్ హీరోగా నటిస్తున్నారు. ఇందులో మీనాక్షిచౌదరి హీరోయిన్ కాగా, సీనియర్ నటుడు భాను చందర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి కావలసి ఉంది. కానీ, శేష్ మేజర్ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉండడం వల్ల హిట్ 2 లాస్ట్ షెడ్యూల్ కు బిగ్ బ్రేక్ పడింది.
తాజాగా అడవిశేష్ హిట్ 2 లాస్ట్ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నట్టు ఫ్యాన్స్ కు బిగ్ అప్డేట్ ఇచ్చారు. నెక్స్ట్ మంత్ నుండి హిట్ 2 షూటింగ్ జరగబోతుందని పేర్కొన్నారు. పర్ఫెక్ట్ క్రైం ఇన్వెస్టిగేషన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిట్ ఫస్ట్ పార్ట్ ఎంత పెద్ద హిట్టయ్యిందో అందరికి తెలుసు. శైలేష్ కొలను టేకింగ్ హిట్ సినిమాకు పెద్ద దన్నులా నిలిచింది. మరి ఇప్పుడు ఈ సిరీస్ లో రాబోతున్న సెకండ్ పార్ట్ కి ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa