ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆలియా భట్ రాక కోసం నిరీక్షిస్తున్న సమంత ...!!

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 23, 2022, 04:27 PM

టాలీవుడ్ టాప్ సైరెన్ సమంత బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఆలియాభట్ కోసం తీవ్రంగా ఎదురుచూస్తుందట. అదేంటి అనుకుంటున్నారా....!! అంటే నిజంగా ఆలియా కోసం కాదు... ఆమె నటించిన "బ్రహ్మాస్త్ర" కోసం. ఇటీవలే ఈ సినిమా నుండి "కుంకుమలా" అనే లిరికల్ సాంగ్ విడుదలవ్వగా, ఆ పాట సమంత విపరీతంగా నచ్చేసిందట. ఈ మేరకు సామ్ తన ఇన్స్టా స్టోరీలో "దిస్ సాంగ్ ఈజ్ ఎవిరీథింగ్ ... ఆలియాభట్ కాంట్ వెయిట్ #బ్రహ్మాస్త్ర" అని పోస్ట్ చేసింది. సమంత ఈ పాటను పదే పదే వింటున్నానని, అందులో పూర్తిగా నిమగ్నమయ్యానని పేర్కొంది. యూట్యూబులో ఈ పాటకు మిలియన్ల కొద్దీ వీక్షణలు, లైక్స్ వస్తున్నాయి.
అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో రణ్ బీర్ కపూర్, ఆలియాభట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్ర సెప్టెంబర్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగులో ఈ చిత్రాన్ని రాజమౌళి సమర్పించడం విశేషం. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa