అపరిచితుడు, ఐ, ఇంకొక్కడు పలు ప్రయోగాలు చేసే తమిళ స్టార్ హీరో విక్రమ్ మరోసారి ప్రయోగానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుతం ఈయన నటించిన 'కోబ్రా' సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో విక్రమ్ 7 రకాల పాత్రల్లో కనిపించనున్నాడట. అంతేకాకుండా ఈ 7 పాత్రలకు తనే డబ్బింగ్ చెప్పాడట.7 పాత్రలకు, 7 వేరియేషన్స్‌లో వాయిస్ ఉంటుందట. నిజమెంతుందో తెలియాలంటే వేచిచూడాల్సిందే.