నటుడు, "మా" ప్రెసిడెంట్ మంచు విష్ణు నటిస్తున్న కొత్త చిత్రం "జిన్నా". ఇషాన్ సూర్య దర్శకత్వంలో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విష్ణు 'గాలి నాగేశ్వరరావు' పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో విష్ణు సరసన పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
AVA ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీ నుండి ఫ్రెండ్ షిప్ సాంగ్ నిన్న విడుదలవ్వగా, ఆ పాటకు యూట్యూబ్ లో విశేష స్పందన వస్తుంది. ఈ పాటకు ఇప్పటివరకు 3.3 మిలియన్ వ్యూస్ , 59కే లైక్స్ వచ్చాయి. ఈ పాట స్పెషాలిటీ ఏంటంటే, విష్ణు ట్విన్ డాటర్స్ అరియనా, వివియానా ఆలపించి, అందులో నటించారు. అనూప్ సూథింగ్ మ్యూజిక్, చిన్నారుల అద్భుతమైన గాత్రం, అభినయం ఈ పాటను చార్ట్ బస్టర్ గా నిలిపాయి.
![]() |
![]() |