రామారావు ఆన్ డ్యూటీ మేకర్స్ టికెట్ రేట్ల విషయంలో మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. సాధారణ టికెట్ రేట్లతోనే రామారావు ఆన్ డ్యూటీ జూలై 29న విడుదలవబోతుందని అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు టికెట్ రేట్లు ఇలా ఉన్నాయి... తెలంగాణా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 150, మల్టీప్లెక్స్ లలో రూ. 195, ఆంధ్రప్రదేశ్ సింగిల్ స్క్రీన్స్ లో రూ. 147, మల్టీప్లెక్స్ లలో రూ. 177.
కొత్త దర్శకుడు శరత్ మండవ డైరెక్షన్లో మాస్ రాజా రవితేజ నటిస్తున్న ఈ చిత్రం పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందింది. దివ్యాన్ష కౌశిక్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందించారు. ఇప్పటివరకు విడుదలైన టీజర్, ట్రైలర్, లిరికల్ సాంగ్స్ ప్రేక్షకుల్లో మంచి బజ్ ను క్రియేట్ చేసాయి.