ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాయిదా పడిన "సీతారామం" ట్రైలర్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 25, 2022, 11:23 AM

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న త్రిభాషా చిత్రం "సీతారామం". 'యుద్ధంతో రాసిన ప్రేమకథ' శీర్షిక. ఈ సినిమాకు హను రాఘవపూడి డైరెక్టర్ కాగా, రష్మిక మండన్నా కీరోల్ పోషిస్తుంది. ఈ మూవీ నుండి ఇప్పటివరకు విడుదలైన టీజర్, గ్లిమ్స్, లిరికల్ సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. 
ఈ మూవీ ట్రైలర్ ఈ సమయానికల్లా అంటే జూలై 25, ఉదయం 11 గంటలకల్లా విడుదలవ్వాల్సి ఉంది. కానీ, హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యల వల్ల ఈ ట్రైలర్ వాయిదా పడినట్టు మేకర్స్ కొంచెంసేపటి క్రితమే అధికారికంగా ఎనౌన్స్ చేసారు. ఈ రోజు మధ్యాహ్నం 12:24 నిమిషాలకు తప్పకుండా ట్రైలర్ విడుదల చేస్తామని ప్రేక్షకులకు మాటిచ్చారు సీతారామం మేకర్స్. ప్రసాద్ ఐమ్యాక్స్ లో జరుగుతున్న ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మండన్నా హాజరుకానున్నారు.
పోతే, వైజయంతి మూవీస్ సమర్పణలో, స్వప్న సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఆగస్టు 5న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com