ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొడుకు చిత్రానికి తండ్రి స్పెషల్ ప్రమోషన్స్ ...!!

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 25, 2022, 12:42 PM

అక్కినేని నాగచైతన్య తొలిసారి హిందీలో నటిస్తున్న చిత్రం "లాల్ సింగ్ చద్దా". హాలీవుడ్ క్లాసిక్ "ఫారెస్ట్ గంప్" కి ఇండియన్ రీమేగ్గా రూపొందిన ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్, కరీనాకపూర్ ఖాన్ జంటగా నటించారు. అద్వైత్ చందన్ సంగీతం అందించారు. బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పించడం విశేషం. ఈ మేరకు ఇటీవలే ఈ మూవీ ప్రివ్యూను మెగాస్టార్ స్పెషల్ గా చూసారు. ఆ స్పెషల్ ప్రివ్యూకి రాజమౌళి, సుకుమార్, నాగార్జున కూడా హాజరయ్యారు.
లేటెస్ట్ గా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆమీర్ ఖాన్, మెగాస్టార్ లను స్పెషల్ గా ఇంటర్వ్యూ చేసే బాధ్యతను నాగార్జున తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆగస్టు 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమాలో చైతు ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. చైతూ బాలీవుడ్ డిబట్ ను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు నాగ్ స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. మరి, ఈ విషయంలో ఎంతమేరకు నిజముందో తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com