నితిన్, కృతిశెట్టి జంటగా, కొత్త దర్శకుడు MS రాజశేఖర్ రెడ్డి డైరెక్షన్లో పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం "మాచర్ల నియోజకవర్గం". శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కేథరిన్ థెరిస్సా మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. మహతీ స్వరసాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 12న విడుదలవడానికి సిద్ధమవుతున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం నుండి గుంటూరులో జరగబోతుంది. డబుల్ హ్యాట్రిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడిగారు ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నారు. ఈవెంట్లో ట్రైలర్ ను 7:43 నిమిషాలకు విడుదల చెయ్యబోతున్నట్టు మేకర్స్ స్పెషల్ ఎనౌన్స్మెంట్ చేసారు. రీసెంట్గా రిలీజైన మాచర్ల ధమ్కీ ఆసక్తికరంగా సాగడంతో ట్రైలర్ కోసం అందరు కుతూహలంగా ఎదురుచూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa