ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించిన సినిమా 'పొన్నియన్ సెల్వన్'. ఈ సినిమాలో చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, బాబీ సింహా వంటి స్టార్లు ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకి ఎ. ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా నుండి ‘పొంగే నది’ అనే లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ కలిసి నిర్మించాయి. ఈ సినిమా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.