ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"అశోకవనంలో అర్జున కళ్యాణం" మూవీ నుంచి 'ఓ ఆడపిల్లా నువ్వర్థం గావా' పాట లిరిక్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 02, 2022, 09:06 AM

పల్లవి:
మాటరాని మాయవా
మాయజేయు మాటవా
మాటులోని మల్లెవా
మల్లెమాటు ముల్లువా

వయ్యారివా కయ్యారివా
సింగారివా సింగానివా
రాయంచవా రాకాసివా
లే మంచులో లావా నీవా

ఓ ఆడపిల్లా నువ్వర్థం గావా
నా జీవితంతో ఆటాడుతావా
ఓ ఆడపిల్లా నువ్వర్థం కావా
నా జీవితంతో ఆటాడుతావా

బుజ్జి బుజ్జి బుగ్గల్లోన ఎరుపుని
కనుల పులిమావా..?
చిట్టి చిట్టీ చెక్కిళ్ళలో నునుపుని
నుదుటికియలేవా

ఓ ఆడపిల్లా నువ్వర్థం కావా
నా జీవితంతో ఆటాడుతావా
ఆ ఆఆ ఆఆ ఆ

చరణం 1:
పది మంది చూస్తు ఉంటే
అడ్డడ్డే అమాయకంగా
ఒక్కరైనా లేకపోతే
అయ్యయ్యో మరో రకంగా
ఉంటూ నా ఎదనే తింటూ
ఈ కధనే సందేహంలో పడదోయకే
ఏంటో నీ ఇబ్బంది
చెప్పెయ్ ఏమౌతుంది
ఎట్టా అట్టా వెళ్ళిపోకే

తిక్కో టెక్కో… చిక్కో చుక్కో
అసలేదో ఒలిచి చెబుతావా
పట్టో బెట్టో… గుట్టో కట్టో
నిజమేదో చెవిన పడనీయ్ వా

ఓ ఆడపిల్లా నువ్వర్థం కావా
నీతోటి స్నేహం సచ్చేటి సావా

చరణం 2:
బతిమాలడానికైనా
ఇదిగో తయారుగున్నా
బదులియ్యి నేటికైనా
బతికియ్ ఏదో విధాన

తాకే ఆ తెరపై దూకే ఓ మెరుపై
నాకై నవ్వే విసిరావే
తీరా నీ ముందుంటే
తీరేలా పొమ్మంటూ
తీరం దాచి తిరిగావే

తప్పో ఒప్పో… గొప్పో ముప్పో
తెలుపక, లొసుగులెడతావా..?
మంచో చెడ్డో… కచ్చో పిచ్చో
తెలియక, నసిగి నడిచేవా..?

ఓ ఆడపిల్లా నువ్వర్థం కావా
సంద్రాలనైన ముంచేటి నావా..!!






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com