విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య నటించిన " థాంక్యూ" సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో మంచి వాసుల్ని రాబడుతుంది. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో రాశి ఖన్నా కథానాయికగా నటిస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, స్లైస్ ఆఫ్ లైఫ్ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా ఆగస్టు 12న అమెజాన్ ప్రైమ్‌లో ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుంది అని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మూవీ మేకర్స్ నుండి త్వరలో వెలువడనుంది. ఈ సినిమాలో అవికా గోర్, మాళవిక నాయర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. "థ్యాంక్యూ" చిత్రాన్ని దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.