ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బింబిసార, సీతారామం టీంలకు మెగాస్టార్ స్పెషల్ అప్రిసియేషన్

cinema |  Suryaa Desk  | Published : Sat, Aug 06, 2022, 10:59 AM

కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకాదరణ తప్పక ఉంటుందని మరోసారి రుజువు చేసాయి నిన్న విడుదలైన బింబిసార, సీతారామం సినిమాలు. ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని బాధపడుతున్న ఇండస్ట్రీకి ఊరటని, ప్రోత్సాహాన్ని ఇస్తూ ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను చేరుకున్న విధానం సంతోషకరం... ఈ సందర్భంగా సీతారామం, బింబిసార మూవీ నటీనటులకు, నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు ఇవే నా మనః పూర్వక శుభాకాంక్షలు ... అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేసారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa