ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహేంద్ర సింగ్ ధోనీ అంటే నాకు చాల ఇష్టం

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 08, 2018, 04:50 PM

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ అంటే తనకు చెప్పలేనంత ఇష్టమని ‘మిస్ దివా-2018’ రన్నరప్ రోషిణి షియోరన్ పేర్కొంది. ఆదివారం ముంబైలో ‘మిస్ దివా’ ఫైనల్ పోటీలు జరిగాయి. బాలీవుడ్ నటులు శిల్పా శెట్టి, మలైకా అరోరా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా  ‘నీ రోల్ మోడల్ ఎవరు?.. వారిని ఎందుకు ఎంచుకున్నావ్?’ అంటూ రన్నరప్ రోషిణిని మలైకా ప్రశ్నించింది.


 టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన రోల్ మోడల్ అని రోషిణి చెప్పడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. నిజానికి ఆమె ఎవరైనా మహిళ పేరు చెబుతుందేమోనని భావించారు. కానీ, ఆమె ధోనీ పేరు చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆటలో అతడు చాలా కూల్‌గా ఉంటాడని, ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటాడని పేర్కొంది. సహచరులను ఎంతగానో ప్రోత్సహిస్తాడని, అతడికి సాయం చేసే గుణం ఎక్కువని చెప్పుకొచ్చింది. ఫైనల్‌లో రోషిణి మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa