బ్రూస్ లీ, సాహో చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన కోలీవుడ్ స్టార్ హీరో అరుణ్ విజయ్ నటించిన 'ఎనుగు' సినిమా జూలై 1, 2022న థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమాలో అరుణ్ విజయ్ సరసన ప్రియా భవానీ శంకర్ జోడిగా నటించింది. స్టార్ డైరెక్టర్ హరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సముద్రఖని, రామచంద్రరాజు, రాధిక శరత్‌కుమార్, యోగి బాబు, అమ్ము అభిరామి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఇప్పుడు ZEE5 తన సోషల్ మీడియా ప్రొఫైల్‌లో ఈ భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామా ఆగష్టు 19, 2022 నుండి తన ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారానికి అందుబాటులో ఉంటుందని అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సతీష్ కుమార్ నిర్మించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.