ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈరోజే లూసిఫర్ 2పై మేజర్ అప్డేట్ 

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 17, 2022, 11:00 AM

మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ తొలిసారి మెగాఫోన్ పట్టి డైరెక్ట్ చేసిన చిత్రం "లూసిఫర్". మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రం 2019 లో మలయాళంలో విడుదలై అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అదేపేరుతో తెలుగులో డబ్ అయ్యిన ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి "గాడ్ ఫాదర్" గా రీమేక్ చేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మోహన్ గాంధీ రూపకల్పనలో ఈ మూవీ తెరకెక్కుతుంది.
ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఇదివరకే చిత్రబృందం ప్రకటించింది. తాజాగా సీక్వెల్ కు సంబంధించిన మేజర్ అప్డేట్ ను ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు తెలపబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు. L 2 ఎంపురాన్ పేరుతో రూపొందబోతున్న ఈ సీక్వెల్ చిత్రానికి మురళి గోపి రచయితగా పని చేసారు. ఇక, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా 2023 ప్రథమార్థంలో విడుదలకానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com