పల్లవి:
మెల్లగా కరగని రెండు మనసుల దూరం
చల్లగా తెరవని కొంటె తలుపుల ద్వారం
వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం
చినుకు పూల హరాలే అల్లుతున్నది మనకోసం
తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లులు వంతెన వేసిన శుభవేళ
ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా కలపని బంధం
మెల్లగా కరగని రెండు మనసుల దూరం
చల్లగా తెరవని కొంటె తలుపులు ద్వారం
చరణం 1:
నీ మెలికలలోన ఆ మెరుపులు చూస్తున్న
ఈ తొలకరిలో తళ తళ నాట్యం నీదేనా
ఆ ఉరుములలోన నీ పిలుపులు వింటున్నా
ఈ చిటపటలో చిటికెల తాళం నీదేనా
నీ మతి చెడే దాహమై అనుసరించి వస్తున్నా
జతపడే స్నేహమై అనునయించనా
చలిపిడుగుల సడి విని జడిసిన బిడియము తడబడి నిన్నువిడగా
ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా కలపని బంధం మెల్లగా
చరణం 2:
ఏ తెరమరుగైనా ఈ చొరవను ఆపేనా నా పరువము నీ
కనులకు కానుక ఇస్తున్నా
ఏ చిరు చినుకైనా నీ సిరులను చూపేనా ఆ వరుణునికే
రుణపడిపోనా ఈ పైనా
త్వరపడే వయస్సునే నిలుపలేను ఇకపైనా
విడుదలే వద్దనే ముడులు వేయనా
మన కలయిక చెదరని చెలిమికి రుజువని చరితలు చదివేలా