సమ్మతమే తదుపరి టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త చిత్రం "నేను మీకు బాగా కావాల్సినవాడిని". సంజన ఆనంద్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఈ రోజు కర్నూల్ లో ప్రమోషనల్ టూర్ ను నిర్వహించింది. పదింటికి ప్రెస్ మీట్, ఏడింటికి IIIT ఇడుపులపాయలో కాలేజ్ ఫెస్ట్ జరగనున్నాయి. ఈ ఈవెంట్లకు NMBK నటీనటులు, ఇంకా చిత్రబృందం మొత్తం రానున్నారు.
ఇటీవలే విడుదలైన నచ్చావ్ అబ్బాయ్ అనే లిరికల్ సాంగ్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. కార్తిక్ శంకర్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ అద్భుతమైన సంగీతాన్ని అందించారు.
కోడి రామకృష్ణ గారి పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా, కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నిర్మింపబడుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన విడుదల కాబోతుంది.